: నేడు హస్తినకు వెళుతున్న టీఎస్ మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు ఢిల్లీ వెళుతున్నారు. 'జాతీయ గ్రామీణ నీటి సరఫరా పథకం' అమలు తీరును సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రాల తాగునీటి సరఫరా శాఖ మంత్రులు హాజరవుతారు. ఈ సమావేశంతో పాటు 'డిజిటల్ ఇండియా' అంశంపై జరిగే ఐటీ మంత్రుల సమావేశంలో కూడా కేటీఆర్ పాల్గొంటారు.