: నేడు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హస్తిన వెళుతున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో మకాం వేయనున్నారు. పర్యటనలో భాగంగా, విభజన చట్టంలో పేర్కొన్న వివిధ అంశాలను సంబంధిత కేంద్ర మంత్రుల దృష్టికి ఆయన తీసుకువెళ్లబోతున్నారు. రూ. 16 వేల కోట్ల రెవెన్యూ లోటును సర్దుబాటు చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి విన్నవించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజీలు తదితర అనేక అంశాలపై సంబంధిత మంత్రులతో చర్చించనున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ అవుతున్నారు.

  • Loading...

More Telugu News