: రేణిగుంటలో 35 మంది బంగ్లా దేశీయుల అరెస్ట్
రేణిగుంట రైల్వే స్టేషన్ లో 35 మంది బంగ్లా దేశీయులను పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. వీరు హౌరా ఎక్స్ ప్రెస్ లో కోల్ కతా నుంచి బెంగళుారు వెళుతున్నారు. ఈ ఉదయం వీరితో పాటే ప్రయాణిస్తున్న ఓ సీఆర్పీఎఫ్ జవాను ఇచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రేణిగుంట రాగానే వీరందరినీ క్రిందకు దింపి పోలీసులు ఎంక్వయిరీ చేశారు. బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వీరు అక్రమంగా చొరబడ్డారని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. తాము కేవలం పొట్టకూటి కోసమే బెంగళూరు వెళ్తున్నామని... బెంగళూరులోని స్టార్ హాటల్స్ లో తమకు పని దొరికిందని బంగ్లాదేశీయులు అంటున్నారు.