: అజ్మల్ బౌలింగ్ కు రేపే పరీక్ష


పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బౌలింగ్ యాక్షన్ కు రేపు అగ్నిపరీక్ష జరగనుంది. అజ్మల్ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేశాడంటూ శ్రీలంక క్రికెటర్లు ఐసీసీకి ఫిర్యాదు చేయడంతో అతని బౌలింగ్ యాక్షన్ ను ఐసీసీ నిపుణులు పరిశీలించనున్నారు. శ్రీలంకతో గాలెలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో అజ్మల్ బౌలింగ్ యాక్షన్ ను ఆటగాళ్లు తప్పుపట్టారు. దీంతో రిఫరీ అతని బౌలింగ్ యాక్షన్ పై ఐసీసీకి నివేదించారు. దీంతో ఆ మ్యాచ్ లో సయీద్ అజ్మల్ వేసిన దూస్రా బంతుల్ని ఐసీసీ నిపుణులు పరిశీలించనున్నారు. 2009 లో అజ్మల్ బౌలింగ్ యాక్షన్ పై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అప్పట్లో పీసీబీ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ యాక్షన్ ను తప్పుపట్టింది. ఐసీసీ మురళీధరన్ బౌలింగ్ పరిశీలించి అజ్మల్, మురళీల బౌలింగ్ యాక్షన్ ఒకలా లేదని, మురళీ బౌలింగ్ లో తప్పులేదని తేల్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News