: విద్యుత్ కోతలకు నిరసనగా మెదక్ ప్రజలు ఆందోళన చేస్తున్నారు: కిషన్ రెడ్డి


విద్యుత్ కోతలకు నిరసనగా మెదక్ జిల్లా ప్రజలు ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం లాఠీలతో కొట్టించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాదులో టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ నివాసంలో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ నెల 26న మెదక్ ఎంపీ అభ్యర్థిని ప్రకటిస్తామని అన్నారు. టీడీపీ, బీజేపీ మధ్య మెదక్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలపై పొత్తు కుదిరిందని ఆయన తెలిపారు. రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుని లబ్ధి పొందుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆందోళనకు ప్రభుత్వం సహకరించకుండా, రైతు రుణాలు చెల్లించకుండా, సింగపూర్ అంటూ షికార్లు చేయడాన్ని తాము ఎండగడతామని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News