: టీసీఎస్ ను వెనక్కినెట్టిన ఐటీసీ
బహుళ ఉత్పత్తుల తయారీదారు ఐటీసీ ఇప్పుడు భారత్ లో అత్యధికులు అభిమానించే సంస్థగా 'ఫార్చూన్' జాబితాకెక్కింది. ఫార్చూన్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన జాబితాలో ఐటీసీ... ఐటీ దిగ్గజం టీసీఎస్ ను వెనక్కినెట్టి టాప్ చెయిర్లో కూర్చోవడం విశేషం. 2014 సంవత్సరానికిగాను రూపొందించిన ఈ లిస్టులో... టాప్-5లో ఐటీసీ తర్వాత ప్రముఖ కన్ స్ట్రక్షన్ సంస్థ లార్సన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టి), హిందుస్థాన్ లీవర్, మారుతి సుజుకి, ఎస్ బీఐ ఉన్నాయి. గతేడాది ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న టీసీఎస్ ఈసారి ఆరోస్థానానికి పడిపోయింది.