: నాలుగో పెళ్ళికి ఉవ్విళ్ళూరుతున్న జెన్నిఫర్ లోపెజ్
పాప్ గాయని, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ మరో వివాహానికి సిద్ధమవుతోంది. సంతోషమయ జీవితం గడిపేందుకు భర్త అవసరమని ఆమె భావిస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీకి మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి. ఓజాని నోయా, క్రిస్ జూడ్, మార్క్ ఆంథోనీలతో విడాకులు తీసుకున్న ఈ అందాల సుందరి తన స్నేహితురాలు చెల్సియా హ్యండ్లర్ నిర్వహించిన ఓ టాక్ షోలో మాట్లాడుతూ, నాలుగో పెళ్ళికి తన సంసిద్ధత గురించి చెప్పింది. నూతన ప్రియుడి గురించిన వివరాలు కూడా ఆ షోలో వెల్లడించిందట. కాగా, ఆంథోనీతో వైవాహిక జీవితంలో లోపెజ్ కు కవలలు జన్మించారు.