: బ్లూఫిలిం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు


విజయవాడలో అరెస్టు చేసిన బ్లూ ఫిలిం ముఠా సభ్యులను పోలీసులు మీడియా ముందుకు తీసుకువచ్చారు. నలుగురు యువకులు, ఓ మైనర్ ను ఈ వ్యవహారంలో అరెస్టు చేసినట్టు తెలిపారు. సాయిరాం, అభిషేక్, దీపక్, షేక్ మున్నాలు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారని వెల్లడించారు. దాడుల సందర్భంగా నీలిచిత్రాలు, సామగ్రి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అమ్మాయిలను ప్రేమ పేరుతో వలలో వేసుకుని, తమ రూంకి తీసుకెళ్ళి వారికి మత్తు మందు ఇచ్చి వారితో లైంగిక కార్యకలాపాలను వీడియోలో బంధించేవారని వివరించారు. తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని, వారి నడవడికను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని పోలీసులు సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News