: శాసనసభలో జగన్ ను చూస్తుంటే నన్ను కొడతారేమోనని భయమేస్తోంది: బీజేపీ ఎమ్మెల్యే విష్ణు
శాంతిభద్రతలపై శాసనసభలో సభలో సీరియస్ గా చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నవ్వుల పువ్వులు పూయించారు. శాసనసభలో జగన్ ను చూస్తుంటే తనను కొడతారేమోనని భయమేస్తోందన్నారు. తనను అన్యాయంగా వైసీపీ సభ్యుల వైపు కూర్చోపెట్టారని... ఆవేశంలో ఎప్పుడు ఎవరొచ్చి తనను కొడతారనే భయంతో తాను శాసనసభలో గడుపుతున్నానని ఆయన అన్నారు. జగన్ మానసిక ప్రవర్తన సరిగ్గా ఉన్నట్టు అనిపించడం లేదని... ఆయనకు వెంటనే సెలవు ఇచ్చి ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు.