: నేడూ పాక్ దళాల కాల్పులు... ఇద్దరు పౌరుల మృతి
పాకిస్థాన్ దళాలు వరుసగా కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్నాయి. ఈ ఉదయం ఆర్ఎస్ పురా, అర్నియా సెక్టార్లలో ఉన్న 22 భారత శిబిరాలే లక్ష్యంగా భారీ ఫైరింగ్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు సాధారణ పౌరులు మరణించగా, ఓ జవాన్ సహా నలుగురికి గాయాలయ్యాయి. ఈ మేరకు సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, ముహమ్మద్ అక్రమ్, అతని 13 ఏళ్ల కుమారుడు అస్లాం చనిపోయినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిలో అక్రమ్ భార్య, అతని ముగ్గురు పిల్లలు, ఓ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉన్నట్లు వివరించారు. వారిని జమ్ము మెడికల్ కాలేజ్ కు తరలించి చికిత్స చేయిస్తున్నామన్నారు.