: మంగలి కృష్ణ, భానుకిరణ్ తెలుసా అని అడిగితే... మమ్మల్ని బఫూన్లు అంటాడా?: గోరంట్ల
అసెంబ్లీకి జగన్ క్షమాపణ చెప్పాల్సిందేనని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. జగన్ కు మంగలి కృష్ణ, భానుకిరణ్ తెలుసా? అని మాత్రమే తాను నిన్న అడిగానని... ఆయన నేరస్థుడని తాను అనలేదని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఇలా అడిగినందుకే తమను 'బఫూన్లు' అంటారా? అని ఆయన జగన్ ను నిలదీశారు. కేవలం జగన్ అహంకార ధోరణితోనే తమను బఫూన్లు అన్నాడని ఆయన వెల్లడించారు.