: అయ్యప్ప సొసైటీ వాసులకు మరో షాక్
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుంచి అనేక సమస్యలను ఎదుర్కొంటున్న హైదరాబాద్ మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ వాసులకు మరో గండం వచ్చి పడింది. వాటర్ బిల్లులను మూడు రెట్లు ఎక్కువగా వసూలు చేయాలని జలమండలి నిర్ణయించింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు లేవనే ఆరోపణలతో ఛార్జీల మోతకు జలమండలి అధికారులు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి త్వరలోనే నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే విద్యుత్ బిల్లులను పెంచి సొసైటీ వాసులకు ట్రాన్స్ కో అధికారులు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టీఎస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని సొసైటీ వాసులు వాపోతున్నారు.