: సింగపూర్ తరహాలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తుంది: కేసీఆర్


సింగపూర్లో ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న కేసీఆర్ సదస్సులో మాట్లాడుతూ... సింగపూర్ తరహాలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. హైదరాబాదును ప్రపంచ దేశాల గమ్యస్థానంగా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాదును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాదులో ప్రపంచ స్థాయి పోలీసింగ్ వ్యవస్థతో పాటు లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాదుకు వంద కిలోమీటర్ల పరిధిలో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధిలో ఐఐఎం విద్యార్థుల భాగస్వామ్యంతో పరిశ్రమలకు అనుకూలించని భూముల్లో సోలార్ పవర్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు పన్ను, విద్యుత్ చార్జీల రాయితీలిస్తామని కేసీఆర్ చెప్పారు.

  • Loading...

More Telugu News