: ఎంఐఎంని, కేసీఆర్ ని ఘాటుగా విమర్శించిన కిషన్ రెడ్డి


ఎంఐఎం పార్టీ పైనా, కేసీఆర్ పైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. మోడీని హైదరాబాదుకు రానిచ్చేది లేదన్న ఎంఐఎం తోక ముడిచిందని ఆయన అన్నారు. ఎంఐఎం భాష తీరు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. కేంద్రంలో ఉన్నది మన్మోహన్ కాదు... మోడీ అని గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. హైదరాబాదు, సరూర్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ కోసం ఉద్యమించిన తాము కేసీఆర్ కంటికి కొత్త బిచ్చగాళ్లలా కనిపించామని అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఉద్యమం చేసేందుకు ఓయూ విద్యార్థులు కావాల్సి వచ్చారని, ఇప్పుడు ఉద్యోగాలు అడుగుతున్న విద్యార్థులను తిడుతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News