: మద్యపానం వారి సంస్కృతిలో ఒక భాగమట!


మద్యపానం అనేది గోవా సంస్కృతిలో భాగమని, అందుకే గోవాలో మద్యనిషేధం అనే ఆలోచన చేయబోమని ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విల్ ఫ్రెడ్ మెస్కిటా అన్నారు. మద్యనిషేధం గోవాలో అమలు చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. కేరళలో దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో విల్ ఫ్రెడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గోవాలో కూడా మద్యనిషేధం అమలుచేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయనీ విషయం చెప్పారు. గోవాలో వివాహ సమయాల్లోను, ఇతర వేడుకల్లోను మద్యం ఇచ్చి పుచ్చుకోవడం సర్వ సాధారణమని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News