: కన్నడ ప్రముఖ రచయిత అనంతమూర్తికి తీవ్ర అస్వస్థత
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కన్నడ ప్రముఖ రచయిత యు.ఆర్.అనంతమూర్తి(82) ఇన్ ఫెక్షన్, జ్వరం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో కృత్రిమ శ్వాస ద్వారా వైద్యులు చికిత్స చేస్తున్నారు. పలు అనారోగ్య సమస్యల కారణంగా పది రోజుల కిందటే మూర్తిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆసుపత్రి డైరెక్టర్, ఛైర్మన్ తెలిపారు. కిడ్నీలు చెడిపోవడంతో కొన్ని సంవత్సరాల నుంచి ఆయన డయాలసిస్ తీసుకుంటున్నారన్నారు. దాంతో, పరిస్థితి రోజు రోజుకీ క్షీణిస్తోందని చెప్పారు.