: గవర్నర్ అధికారాలపై ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోలేం: కేంద్ర హోంశాఖ


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదు శాంతి భద్రతలపై ప్రత్యేక అధికారాలు గవర్నరుకు కట్టబెట్టే అంశంపై కేంద్రం తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఆదేశాల నుంచి వెనక్కి తగ్గేదిలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ఏపీ విభజన బిల్లులోని అంశాల ఆధారంగానే గవర్నరుకు ప్రత్యేక అధికారాలిచ్చామని తెలిపింది. ఢిల్లీలో ఈరోజు (శుక్రవారం) గవర్నర్, తెలంగాణ ఎంపీలతో హోంశాఖ సమావేశమైంది. హైదరాబాదుపై గవర్నర్ హవాపై చర్చించారు. ఈ సమయంలోనే హోంశాఖ పైవిధంగా పేర్కొంది. హైదరాబాదులో రోజువారీ శాంతిభద్రతల వ్యవహారంలో గవర్నర్ జోక్యం ఉండదని చెప్పింది. కానీ, గవర్నర్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి పరిస్థితిని అంచనా వేయాలని నరసింహన్ ను హోంశాఖ ఆదేశించింది.

  • Loading...

More Telugu News