: 16 నెలలు జైలులో చిప్పకూడు తిన్న తర్వాత కూడా జగన్ కు బుద్ధి రాలేదు: గోరంట్ల
శాసనసభ పదినిమిషాల వాయిదా తర్వాత మళ్లీ ప్రారంభమైంది. సభ ప్రారంభమైన తర్వాత జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 16 నెలలు జైలులో చిప్పకూడు తిన్న తర్వాత కూడా జగన్ కు బుద్ధి రాలేదని ఆయన తీవ్ర ఆగ్రహావేశాలతో మండిపడ్డారు. జగన్ కన్నా పెద్ద బఫూన్ ఎవరూ లేరని బుచ్చయ్య విరుచుకుపడ్డారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో శాసనసభలో ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు వినలేదని ఆయన అన్నారు.