: త్వరలో ఆర్ బీఐ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు


దేశంలో వచ్చే ఏడాది నుంచి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను తీసుకొచ్చే యోచనలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. పైలట్ ప్రాజెక్టు ఆధారంగా నకిలీ నోట్లను అరికట్టేందుకు, సెక్యూరిటీని మరింత పటిష్ఠం చేసే క్రమంలోనే ఈ నోట్లను తీసుకురావాలనుకుంటోంది. అంతేగాక జాతీయ బిల్లు చెల్లింపులు వ్యవస్థ ఏర్పాటుతో మధ్యవర్తులను తొలగించి, సామర్థ్యాన్ని పెంచేందుకు తోడ్పడనుంది. ఈ మేరకు ఆర్ బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మాట్లాడుతూ, "ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయి. ఇప్పటికే ఒక బిలియన్ కు టెండర్ బిడ్లను పిలిచాము. షిమ్లాతో పాటు ఐదు నగరాల్లో పైలట్ పరీక్ష చేశాము" అని పేర్కొన్నారు. అయితే, కొచ్చి, మైసూర్, జైపూర్, భవనేశ్వర్, షిమ్లాలో కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టవచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News