: ఏకగ్రీవ ఎన్నికకు సహకరించండన్న మండలి... పార్టీలో చర్చించి చెబుతామన్న జగన్
ఈ ఉదయం శాసనసభలో వైకాపా అధినేత జగన్ ను ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ కలిశారు. త్వరలోనే జరగనున్న నందిగామ ఉపఎన్నిక ఏకగ్రీవంగా జరిగేలా సహకరించాలని ఈ సందర్భంగా ఆయన జగన్ ను కోరారు. దీనిపై స్పందించిన జగన్... పార్టీలో చర్చించి నిర్ణయం తెలియజేస్తానని సమాధానమిచ్చారు.