: ఆంధ్రా పోలీసులకు అత్యాధునిక అమెరికన్ గన్స్


గ్రేహౌండ్స్... ఈ పేరు వింటే చాలు మావోయిస్టుల నుంచి ఉగ్రవాదుల వరకు ఓ నిమిషం కచ్చితంగా భయపడతారు. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే గ్రేహౌండ్స్ దళాల వల్ల ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశంలోనే బెస్ట్ పోలీస్ గా పేరు వచ్చింది. గ్రేహౌండ్స్ దళాల వల్లే రాష్ట్రంలో మావోయిస్టులు పూర్తిగా అదుపులోకి వచ్చారు. ఇంతే కాదు దేశంలోని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని పోలీసులకు కూడా ఏపీ గ్రేహౌండ్స్ దళాలు శిక్షణ ఇస్తున్నాయి. తాజాగా గ్రేహౌండ్స్ దళాలకు అత్యాధునిక ఆయుధాలను ఇవ్వాలని ఏపీ సర్కార్ నిశ్చయించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మావోయిస్టులతో పాటు ఉగ్రవాదుల కార్యకలాపాలు కూడా ఏపీ లో మళ్లీ జోరందుకోనున్నాయని నిఘావర్గాలు హెచ్చరించడంతో... ప్రభుత్వం వీరికి ప్రపంచంలోనే అందుబాటులో ఉన్న అత్యాధునిక ఆయుధాలు అందివ్వాలని నిశ్చయించింది. ప్రస్తుతం మావోయిస్టులు, ఉగ్రవాదులు కూడా ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్‌ లాంటి అత్యాధునిక గన్స్ ను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో... వాటికి మించిన గన్స్ ను గ్రేహౌండ్స్ దళాలకు అందివ్యాలని ఏపీ పోలీస్ శాఖ నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే అమెరికాలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ ఆయుధ తయారీ కంపెనీ(కోల్ట్‌) నుంచి.... కోల్ట్‌ 7.62 గన్స్ ను ఆర్డర్‌ ఇచ్చారు. తొలి విడతలో 15 కోట్లు ఖర్చుపెట్టి వెయ్యి గన్స్ కు ఆర్డర్ ఇచ్చారు. మరో వారం పది రోజుల్లో ఏపీ పోలీసులకు ఈ గన్స్ అందనున్నాయి. ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టిన అమెరికన్ 'సీల్స్' దళాలు ప్రస్తుతం కోల్ట్ గన్స్ నే వాడుతున్నాయి. ఒసామా బిన్ లాడెన్ మీద ఎటాక్ చేసినప్పుడు సీల్స్ దళాలు వాడినవి కోల్ట్ 7.62 గన్సే కావడం విశేషం.

  • Loading...

More Telugu News