: ఇంట్లో లేను... అందుకే సర్వేలో పాల్గొనలేదు: పవన్ కల్యాణ్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వేలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొనని సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మీడియా కూడా హైలైట్ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ అంశంపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, తాను సర్వేలో పాల్గొనకపోవడం వెనకున్న కారణాన్ని జనసేనాని వెల్లడించారు. సర్వే జరిగిన రోజున తాను ఇంట్లో లేనని... అందుకే సర్వేలో పాల్గొనలేకపోయానని పవన్ వివరించారు.