: ఒక్క బక్కెట్ కాదు... 11 ఐస్ బకెట్లు పోయించుకున్న అక్షయ్


'ఐస్ బకెట్ ఛాలెంజ్' కార్యక్రమంలో అక్షయ్ కుమార్ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. 8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో 11 ఐస్ బకెట్ల నీరు పోసుకుని తన సత్తా చాటాడు. 'డేర్ టూ డ్యాన్స్' కార్యక్రమంలో భాగంగా చిల్లీ ఎన్విరాన్స్ ఆఫ్ కేప్ టౌన్ లో ఉన్న ఈ హీరో ఐస్ బకెట్ లో తడిసి ముద్దయ్యాడు. కాగా, మంచినీటిని వేస్ట్ చేయనని తెలిపిన అక్షయ్... ఇందు కోసం సముద్రపు నీటిని వాడాడు. డేర్ టు డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొన్న యువకులను తాను ఏడిపిస్తుండడంతో తనపై నీళ్లు పోసేందుకు ఉత్సాహంతో ఎదురు చూశారని అక్షయ్ తెలిపారు. 11 ఐస్ బకెట్ల నీళ్లు పోయించుకున్న అక్షయ్ తన తరువాత ఛాలెంజ్ స్వీకరించే వారిగా తన భార్య ట్వింకిల్ ఖన్నా, తన మిత్రులు సల్మాన్ ఖాన్, జానీ లీవర్, అశ్వినీ ఆర్డీ పేర్లను నామినేట్ చేశాడు.

  • Loading...

More Telugu News