: అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన దినేష్ రెడ్డి, దిలీప్ కుమార్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ భారతీయ జనతాపార్టీలో చేరారు. హైదరాబాదు పర్యటనలో ఉన్న అమిత్ షా వారిరువురికీ కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీని దిలీప్ కుమార్ బీజేపీలో విలీనం చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దినేష్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, పరాజయం పాలైన సంగతి తెలిసిందే.