: అమెరికా జెట్ ఫైటర్ల సమరోత్సాహం... ఐఎస్ఐఎస్ బెదిరింపులు బేఖాతరు


ఇరాక్ లో వైమానిక దాడులు ఆపకపోతే తమ అధీనంలో ఉన్న మరో అమెరికా పాత్రికేయుణ్ణి కూడా చంపేస్తామన్న ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ బెదిరింపులను అగ్రరాజ్యం బేఖాతరు చేసింది. ఈ క్రమంలో అమెరికా నేవీ యుద్ధ విమానాలు మరోసారి ఇరాక్ లోని ఐఎస్ఐఎస్ మిలిటెంట్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. మోసుల్ డ్యాంకు సమీపంలో 14 పర్యాయాలు దాడి చేశాయి. మిలిటెంట్లను అణచివేసేందుకు యత్నిస్తున్న ఇరాకీ సైన్యం, కుర్దు సాయుధులకు దన్నుగా అమెరికా ఈ వైమానిక దాడులు చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా, తొలి విడత దాడులకు ప్రతీకారంగా ఐఎస్ఐఎస్ సంస్థ అమెరికా జర్నలిస్టు జేమ్స్ ఫోలీ గొంతు కోయడం అంతర్జాతీయ సమాజాన్ని షాక్ కు గురిచేసింది. మరోసారి దాడికి దిగితే తమ వద్ద బందీగా ఉన్న స్టీవెన్ సాట్లాఫ్ అనే జర్నలిస్టును అదే రీతిలో బలి తీసుకుంటామని ఐఎస్ఐఎస్ వీడియోలో అమెరికాను హెచ్చరించింది.

  • Loading...

More Telugu News