: ప్రత్యామ్నాయాలు లేకే ధోనీని కొనసాగిస్తున్నారా..?


టీమిండియా కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్లో అత్యంత క్లిష్టమైన ఘడియలను ఎదుర్కొంటున్నాడు. ఇంగ్లండ్ చేతిలో వరుస ఓటములతో కెప్టెన్సీ సామర్థ్యాలు ప్రశ్నార్థకం కాగా, బీసీసీఐ మద్దతు ఒక్కటే ప్రస్తుతం ఈ జార్ఖండ్ డైనమైట్ కు ఊరట. భారత మాజీ క్రికెటర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా ధోనీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న దాఖలాల్లేవు. అంతెందుకు, ఇంతకుముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీకి చీఫ్ గా వ్యవహరించిన కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ధోనీని విమర్శిస్తున్నాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. "కెప్టెన్ పదవికి వేరొకరు సిద్ధంగా లేకపోవడంతో ధోనీ బతికిపోతున్నాడు. అయినా, ఈ విషయంలో మరోసారి పునరాలోచించాల్సిన సమయం వచ్చింది. అయినా, కెప్టెన్ పదవికి తగిన వారేరీ..? సమస్యంతా ఇక్కడే వస్తోంది" అని శ్రీకాంత్ అన్నారు. కోహ్లీని భావి కెప్టెన్ గా కొన్నాళ్ళ క్రితం ఆకాశానికెత్తిన వారు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. ఈ ఢిల్లీ స్టార్ ఫాం ప్రస్తుతం అత్యంత దారుణ స్థితిలో ఉంది. ఏదేమైనా, వన్డే వరల్డ్ కప్ వరకు ధోనీ కెప్టెన్సీకి ఢోకా లేనట్టే. ప్రస్తుతం జట్టు నిర్మాణాత్మక దశలో ఉందన్న బీసీసీఐ వాదన ధోనీ పాలిట వరమైంది.

  • Loading...

More Telugu News