: ఒక్క టీకాతో రెండు భయంకర వ్యాధులకు చెక్ పెట్టొచ్చు!


ఒక్క టీకాతో ఇప్పుడు రెండు భయంకర వ్యాధులను అరికట్టవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పుడు క్షయ వ్యాధి నివారణ కోసం వాడుతున్న బీసీజీ టీకాను వారు మరింత శక్తిమంతం చేశారు. టీకాలోని సూక్ష్మక్రిములను జన్యుపరంగా మార్పు చేసి... ఇప్పుడు ‘ఆర్ బీసీజీ 30’ అనే కొత్త టీకాను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇది క్షయ వ్యాధితో పాటు కుష్టు వ్యాధి నుంచి కూడా సమర్థవంతంగా రక్షణ కల్పిస్తున్నదని జంతువులపై చేసిన పరిశోధనల్లో తేలింది. క్షయ నివారణ కోసం ప్రస్తుతం వాడుతున్న బాసిలే కాల్ మెట్ గ్యుయెరిన్ (బీసీజీ) టీకా కొద్దిమేరకు కుష్టు నుంచి కూడా రక్షణ కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ఇప్పుడు క్షయ బ్యాక్టీరియాకు చెందిన 30 కేడీఎ ప్రొటీన్ ను ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసేలా తీర్చిదిద్దారు. ఇది ఒకే సమయంలో రెండు వ్యాధుల నుంచి మరింతగా రక్షణ కల్పిస్తుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ మార్కన్ ఎ.హోర్ విట్జ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News