: జైపాల్ రెడ్డి, రాజనర్సింహేనా?... నేనూ ఉన్నా: సర్వే
మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేతలు తహతహలాడుతున్నారు. నేనంటే నేనంటూ ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ రేసులో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పోటీకి సిద్ధమని అధిష్ఠానానికి సంకేతాలివ్వగా, తాజాగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా పోటీకి సై అంటున్నారు. మెదక్ లోక్ సభకు పోటీ చేయమని అధిష్ఠానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని సర్వే తెలిపారు.