: ‘ఫ్యాన్’ను వదిలేసి... ‘కారె’క్కిన విజయారెడ్డి


పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. సీనియర్ నేతలు కేకే, నాయిని, మహమూద్ అలీ, ఎంపీ కవిత సమక్షంలో ఆమె టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా విజయారెడ్డి మాట్లాడుతూ... పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తానని చెప్పారు. ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. రేపటి నుంచి పార్టీలోకి మరింత మంది వచ్చి చేరుతారన్నారు. జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యమని కవిత పునరుద్ఘాటించారు.

  • Loading...

More Telugu News