: ఎన్నికల్లో ఇక పోటీ చేయను గాక చేయను: వీహెచ్
క్షవరమైతే కానీ వివరం రాదని... అనుభవంలోకి వస్తే కానీ తత్వం బోధపడదని పెద్దలు చెబుతారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కి తాజా ఎన్నికలు పాఠాలు బాగానే నేర్పించినట్టున్నాయి. అందుకే ఎన్నికల్లో పోటీచేయనని సంచలన ప్రకటన చేశారు. పార్టీ అధిష్ఠానానికి నమ్మిన బంటుగా ఉంటూ వస్తున్న హనుమంతరావు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కిషన్ రెడ్డి చేతిలో దారుణంగా ఓటమి చవిచూశారు. దీంతో ఇకపై ఎన్నికల్లో పోటీచేసేది లేదని, చివరి వరకు పార్టీకి సేవ చేస్తూ ఉండిపోతానని ఆయన సెలవిచ్చారు.