: 2జీ స్పెక్ట్రమ్ కేసులో రాజా, కనిమొళిలకు బెయిల్
2జీ స్పెక్ట్రమ్ స్కాంకు సంబంధించిన 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో మాజీ టెలికం మంత్రి రాజా, ఎంపీ కనిమొళితో పాటు మరో ఏడుగురు నిందితులకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు (బుధవారం) జరిగిన విచారణకు రాజా, కనిమొళి కోర్టుకు హాజరయ్యారు. కాగా, ఈ ఉదయం కరుణానిధి భార్య, కనిమొళి సవతి తల్లి దయాళు అమ్మాళ్ కు కూడా బెయిల్ లభించిన సంగతి తెలిసిందే.