: విభజన సమస్యలపై ఏపీ, తెలంగాణ సీఎస్ ల భేటీ
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇంకా పరిష్కారం కాని కొన్ని అంశాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్) భేటీ అయ్యారు. హైదరాబాదులోని సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.