: భారత పర్యాటకులకు ఇప్పుడిదే 'హాట్ స్పాట్'
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అత్యంత జన సమ్మర్ధ నగరంగా దుబాయ్ కి పేరు. ఇప్పుడీ నగరం భారత పర్యాటకులకు హాట్ స్పాట్ గా మారింది. ఈ ఏడాది ప్రథమార్థంలో భారతీయులు ఎక్కువగా పర్యటించింది దుబాయ్ లోనేనట. హోటల్స్.కామ్ చేపట్టిన ఓ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. భారత టూరిస్టుల ప్రాధాన్యత క్రమంలో దుబాయ్ తాజాగా బ్యాంకాక్ ను వెనక్కినెట్టడం విశేషం. 2012, 2013లో ఈ జాబితాలో అగ్రస్థానం బ్యాంకాక్ దే. హోటల్స్.కామ్ తాజాగా విడుదల చేసిన జాబితాలో సింగపూర్, హాంకాంగ్, పట్టాయా తదితర ఆగ్నేయాసియా దేశాలు ఉన్నాయి.