: మేకలను కోసినట్టు అమెరికా జర్నలిస్టుల పీకలు కోశారు!


ఇస్లామిక్ ఉగ్రవాదం ఎంతటి హింసాత్మక చర్యలకు కారణమవుతుందో తెలిపే సంఘటన ఇది. తాజాగా ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు విడుదల చేసిన ఓ వీడియోలో ఇద్దరు అమెరికా జర్నలిస్టుల తలలను పదునైన కత్తితో కోయడం సంచలనం సృష్టిస్తోంది. కాగా, ఉగ్రవాదుల చేతిలో బలైన ఇద్దరిలో ఒకరిని 2012 నవంబర్ 22న కిడ్నాప్ కు గురైన జేమ్స్ ఫోలీగా గుర్తించారు. మరో జర్నలిస్టు గతేడాది సిరియాలో కనిపించకుండా పోయిన స్టీవెన్ సాట్లాఫ్ అని తెలుస్తోంది. ఇరాక్ లో అమెరికా చర్యలకు ప్రతిగానే జర్నలిస్టులను చంపినట్టు వీడియో వెల్లడిస్తోంది. ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు ఈ వీడియోకి 'మెసేజ్ టు అమెరికా' అని పేరు పెట్టారు. సోషల్ మీడియాలో పోస్టయిన ఈ వీడియోను తాము పరిశీలించామని అమెరికా జాతీయ భద్రత మండలి ప్రతినిధి కైట్లిన్ హేడెన్ తెలిపారు. జర్నలిస్టుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News