: గద్దె దిగకపోతే నీ ఇంటిని ముట్టడిస్తాం... షరీఫ్ కు ఇమ్రాన్ హెచ్చరిక


పాకిస్థాన్ లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ప్రధాని పదవి నుంచి నవాజ్ షరీఫ్ బుధవారంలోగా తప్పుకోవాలంటూ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అల్టిమేటం జారీ చేశారు. నేటి సాయంత్రంతో గడువు ముగియనుండడంతో ఇమ్రాన్ తాజాగా మరో హెచ్చరిక జారీ చేశారు. గద్దె దిగకపోతే లక్షలాది మందితో షరీఫ్ ఇంటిని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. కాగా, తన 'ఆజాద్' ఉద్యమంపై ఇమ్రాన్ సోషల్ మీడియాలో వివరణ ఇస్తూ, పాకిస్థాన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఈ 'భారీ చర్య' తీసుకోవాల్సి వచ్చిందని ట్వీట్ చేశారు. "అన్యాయమే పాలనగా మారినప్పుడు, ప్రతిఘటన కర్తవ్యం అవుతుంది" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News