: ఏపీ తొలి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి


విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెడుతున్నారు. 2014-15కు గాను ఈ బడ్జెట్ ను సమర్పిస్తున్నారు. కాగా, పదేళ్ల తర్వాత టీడీపీ హయాంలో మొదటి బడ్జెట్ ఇదే. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ, గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయిందన్నారు. అవినీతి, కుంభకోణాలు కొంతకాలంగా రాజ్యమేలాయని... దాంతో, వ్యవస్థను సరిదిద్దాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై పడిందని పేర్కొన్నారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. పాలనా యంత్రాంగాన్ని పునరుత్తేజం చేస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆదాయ పంపిణీ సక్రమంగా జరగలేదన్న మంత్రి, పునర్విభజన చట్టంలో అనేక సమస్యలు గాలికొదిలేశారన్నారు.

  • Loading...

More Telugu News