: బ్లాక్ మనీపై నేడు నివేదిక సమర్పించనున్న సిట్
నల్లధనంపై ఏర్పాటైన సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఈ రోజు తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలో సిట్ ఏర్పాటయిన విషయం తెలిసిందే. నల్లధనాన్ని గుర్తించడం, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని మన దేశానికి రప్పించడం తదితర అంశాలపై సిట్ తన నివేదికలో పలు సిఫారసులు చేయనుంది. నల్లధనంపై ఉక్కుపాదం మోపాలనుకుంటున్న ప్రధాని మోడీకి ఈ నివేదిక ఎంతో ఉపకరించే అవకాశాలు ఉన్నాయి.