: ప్రధాని ఫాలోయింగ్ కి చిన్నబుచ్చుకున్న హర్యానా సీఎం
ప్రధాని నరేంద్రమోడీకి దక్కిన ఆదరణ హర్యానా ముఖ్యమంత్రిని చిన్నబుచ్చుకునేలా చేసింది. కాంగ్రెస్ పాలిత హర్యానాలో ప్రధాని ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూపేందర్ సింగ్ హుడా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చింది. ప్రధానిగా తొలి పర్యటనకు వెళ్లిన మోడీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బహిరంగ సభలో మోడీకి జయజయధ్వానాలు పలికారు. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు కురిపించారు. కనీసం హుడా ప్రసంగం కూడా సభికులు వినలేదు. దీంతో హుడా చిన్నబుచ్చుకున్నారు. ఈసారి ప్రధాని సభలో తాను పాల్గోనని ఆయన స్పష్టం చేశారు.