: జగన్, నిమ్మగడ్డ ఆస్తుల జప్తును సమర్థించిన న్యాయప్రాధికార సంస్థ
వైఎస్సార్సీపీ అధినేత జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ ఆస్తులు జప్తు చేయడాన్ని న్యాయప్రాధికార సంస్థ సమర్ధించింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ న్యాయప్రాధికార సంస్థ ముందు వాదనలు పూర్తి చేసింది. 2014 మార్చి 5న వాన్ పిక్ కు సంబంధించిన కేసులో జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన 863 కోట్ల రూపాయలను ఈడీ జప్తు చేసింది. ఈడీ జప్తును న్యాయప్రాధికార సంస్థలో జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ సవాలు చేశారు. దీంతో ఈడీ జప్తును న్యాయప్రాధికార సంస్థ సమర్ధించింది. కాగా, జగన్ కు చెందిన కార్మెల్ ఏషియా హోల్డింగ్స్, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ లతోపాటు నిమ్మగడ్డకు చెందిన జీ2, ఆల్ఫావిల్లాస్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది.