: సర్వే కోసం వచ్చిన భార్యను ఇంట్లోకి రానివ్వని భర్త... ఆందోళన చేస్తున్న భార్య


సమగ్ర సర్వే ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసింది. దూరాభారాలు, కష్టనష్టాలకోర్చి ప్రజలు స్వస్థలాలకు చేరుకోగా, మరి కొంత మంది పలు రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దంపతుల మధ్య సర్వే వివాదాన్ని పెద్దది చేసింది. సర్వేలో పాల్గొనేందుకు వచ్చిన భార్యను భర్త ఇంట్లోకి రానివ్వకపోడంతో ఆ ఇల్లాలు చంటి బిడ్డతో భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. హైదరాబాదులో 2010లో నాన్సీ, సుభాస్‌ల వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొద్దిరోజులకే అదనపు కట్నం కోసం వేధించిన అత్తింటివారు నాన్సీని ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. న్యాయస్థానం నుంచి రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చుకుని తిరిగి భర్త వద్దకు వచ్చింది. కొన్నాళ్లు కాపురం చేసిన దంపతులకు ఓ పాప జన్మించింది. తిరిగి వేధింపులు మొదలవడంతో మరోసారి కేసు నమోదు చేసిన ఆమె, పుట్టింట్లో ఉంటోంది. సమగ్ర సర్వేలో తన పేరు, తన బిడ్డ పేరును నమోదు చేయించుకునేందుకు భర్త ఇంటికి రాగా ఆమెను అత్తింటి వారు ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంటి ఎదుట బైఠాయించింది.

  • Loading...

More Telugu News