: మనుషుల ప్రాణాల కన్నా ముఖ్యమైన అంశం ఏదైనా ఉందా?: అసెంబ్లీ లో జగన్
వాయిదా తర్వాత అసెంబ్లీ మళ్లీ ప్రారంభమైంది. సభా నియమాల ప్రకారం వైకాపా ఇచ్చిన నోటీసుపై రేపు చర్చిద్దామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. దీనిపై జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. రేపు బడ్జెట్ ప్రవేశపెడుతుండడంతో... తాము రేపటి నుంచి బడ్జెట్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తామని... కావున ఈ రోజే మూడు నెలలుగా జరుగుతున్న హత్యా రాజకీయాలపై చర్చకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు మనుషుల ప్రాణాలకు మించిన ముఖ్యమైన అంశం ఏదైనా ఉందా? అని జగన్ వ్యాఖ్యానించారు. జగన్ ప్రతిపాదనకు స్పీకర్ ఒప్పుకోకపోవడంతో సభలో మళ్లీ గందరగోళం నెలకొంది.