: నకిలీ నోట్ల సూత్రధారి, కరడు గట్టిన నేరస్థుడు ఎల్లంగౌడ్ అరెస్ట్
నకిలీ నోట్ల చలామణిలో కీలక నిందితుడుగా ఉన్న ఎల్లంగౌడ్ అరెస్ట్ అయ్యాడు. ఇతడిని ఎస్ఓటీ పోలీసులు మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్నారు. రెండు వారాల క్రితం హైదరాబాద్ షామీర్‌పేటలో పోలీసులకు చిక్కినట్టే చిక్కి ఎల్లంగౌడ్ తప్పించుకున్నాడు. అప్పట్లో ఎల్లంగౌడ్ ను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో, పోలీసులకు, ఎలంగౌడ్ ముఠాకు పరస్పరం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ కానిస్టేబుల్‌తో సహా ఎల్లంగౌడ్ అనుచరుడు మృతిచెందాడు. ఈ కాల్పుల్లో ఓ ఎస్సైకి కూడా తీవ్రగాయాలయ్యాయి. అప్పటినుంచి ఎల్లంగౌడ్ గురించి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు మొదలుపెట్టారు. చివరికి మహారాష్ట్రలోని నాంధేడ్ లో పోలీసులకి ఎల్లంగౌడ్ లొంగిపోయాడు. మహారాష్ట్రలోని ఓ రాజకీయనాయకుడి సహాయంతో ఎల్లంగౌడ్ పోలీసుల ముందుకు వచ్చాడు. అతని నుంచి 40 వేల నగదు, ఓ పిస్టోలును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్లంగౌడ్ పై దాదాపు 30 కేసులున్నాయి. పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారన్న భయంతోనే ఎల్లంగౌడ్ లొంగిపోయినట్టు సమాచారం.