: అసెంబ్లీకి ఊతకర్ర సాయంతో వచ్చిన బాలయ్య


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొదటిరోజు సమావేశాల్లో నందమూరి బాలకృష్ణ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ... ఆయన గాయపడ్డారు. ఆ తర్వాత తొలిసారి కనపడడంతో... ఆయనను తెదేపా, వైకాపా పార్టీలకు చెందిన పలువురు ఎమ్మేల్యేలు పరామర్శించారు. ఆయనకు గాయం ఎలా అయ్యిందో... ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అడిగిన వారందరికీ సమాధానం చెబుతూ బాలకృష్ణ చాలా ఉత్సాహంగా కనిపించారు. తొలిరోజు అసెంబ్లీకి బాలకృష్ణ ఊతకర్ర సాయంతో వచ్చారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బాలకృష్ణ, రోజా మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News