: కడపలో తహశీల్దార్ పై ఇసుక మాఫియా దాడి
కడప జిల్లాలో చెన్నూరు తహశీల్దార్ పై ఇసుక మాఫియా దాడులకు దిగింది. చెన్నూరు మండలంలోని ఓబులంపల్లి వద్ద అక్రమ ఇసుక త్రవ్వకాలను గుర్తించిన తహశీల్దార్ తన సిబ్బందితో తిరిగి వస్తుండగా దుండగులు ఆయన ప్రయాణిస్తున్న కారుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై తహశీల్దార్ జాయింట్ కలెక్టరుకు ఫిర్యాదు చేశారు.