: నా దగ్గర లక్ష కోట్లుంటే, పదిశాతం నాకిచ్చి మిగతాది మీరే తీసుకోండి: టీడీపీకి జగన్ ఆఫర్
బడ్జెట్ లో రుణమాఫీకి లక్ష కోట్లు కేటాయించాలని వైసీపీ అధినేత జగన్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీకి లక్ష కోట్లు కేటాయించకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన హెచ్చరించారు. మాటిమాటికీ లక్ష కోట్లు ఆర్జించానని ఆరోపణలు చేస్తే... టీడీపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. తన దగ్గర రూ. లక్ష కోట్లుంటే, పది శాతం తనకిచ్చి మిగతాది టీడీపీ నేతలు తీసుకోవాలని ఆయన ఆఫర్ చేశారు. తనకు సంబంధం లేకపోయినా, పరిటాల రవి కేసులో తనపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జేసీ బ్రదర్స్ ను టీడీపీలో ఎందుకు చేర్చుకున్నారని జగన్ ప్రశ్నించారు.