: మూడు నెలల్లో 11 మంది వైసీపీ కార్యకర్తలను చంపేశారు: సభలో వైఎస్ జగన్
వాయిదా అనంతరం... ఏపీ అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడారు. మూడు నెలల్లో 11 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను కిరాతకంగా చంపేశారని జగన్ ఆరోపించారు. ఈ విషయంలో ఏ చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని అడిగితే... తమకు సమాధానం ఏమీ లభించలేదని అన్నారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలతో బతుకుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.