: హత్యా రాజకీయాలపై మాట్లాడే తొలి అవకాశం నాకే ఇవ్వాలి: పరిటాల సునీత
హత్యా రాజకీయాలపై శాసనసభలో మాట్లాడాల్సి వస్తే... మొదటి అవకాశం తనకే ఇవ్వాలని మంత్రి పరిటాల సునీత అన్నారు. హత్యారాజకీయాలతో అనేక ఇబ్బందులు పడ్డ కుటుంబం తనదని ఆమె చెప్పారు. ఈ రాజకీయాల వల్ల భర్తను సైతం తాను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో హత్యారాజకీయాలతో భయానక వాతావరణం సృష్టించిన వ్యక్తులు... ఇప్పుడు హత్యారాజకీయాలకు టీడీపీ పాల్పడుతోందని ఆరోపించడం హాస్యాస్పదమని అన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియా లాబీలో ఆమె మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.