: బీఏసీ సమావేశానికి హాజరైన జగన్
బీఏసీ సమావేశానికి హాజరుకాబోమని నిన్నటి వరకు చెప్పిన వైఎస్సార్సీపీ తన మనసు మార్చుకుంది. ఈ రోజు జరిగిన బీఏసీకి ఆ పార్టీ అధినేత జగన్ స్వయంగా హాజరయ్యారు. బీఏసీలో వైకాపాకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై ఈ సందర్భంగా ఆయన అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా అవతరించిన పార్టీకి బీఏసీలో సరైన ప్రాతినిథ్యం కల్పించడం లేదని జగన్ నిరసన వ్యక్తం చేశారు.