: ఓవల్ టెస్టులో భారత్ ఘోర పరాజయం


ఓవల్ టెస్టులో భారత్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇన్నింగ్స్, 244 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ను 3-1 తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 148 పరుగులకే భారత్ ఆలౌట్ అవ్వగా... బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 486 పరుగులు చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 94 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్టువర్ట్ బిన్నీ 25 పరుగులు, విరాట్ కోహ్లి 20, పూజారా 11 పరుగులు చేశారు. మిగతా వారందరూ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. దీంతో, ఇన్నింగ్స్ తేడాతో భారత్ ఓటమి పాలైంది.

  • Loading...

More Telugu News