: ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా నిలదీయండి: జగన్
అసెంబ్లీ వేదికపై ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా నిలదీయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాదులోని లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. కాగా, ఈ సమావేశానికి 29 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ప్రజా సమస్యలన్నింటినీ సభలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు విధిగా హాజరుకావాలని ఎమ్మెల్యేలను ఆయన ఆదేశించారు.